ఇటలీకి చెందిన ఓ జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లైంది. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం అనే నమ్మకంతో, తమ 40వ వివాహవార్షికోత్సం సందర్భంగా ఉత్తర్ప్రదేశ్.. ఆగ్రాలోని తాజ్మహల్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు మౌరో, స్టెఫానియా దంపతులు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహాన్ని స్థానికులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. 'భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాన్ని మరిచిపోతున్నా.. విదేశీయులు మాత్రం మన సంప్రదాయాలు పాటిస్తున్నారు' అని ఇటాలియన్ దంపతులకు పెళ్లి చేసిన పురోహితుడు ప్రవీణ్ దత్ అభిప్రాయపడ్డారు.
హిందూ సంప్రదాయంలో ఇటాలియన్ జంట పెళ్లి.. తాజ్మహల్ వేదికగా..
ఇటలీకి చెందిన ఓ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి తాజ్మహల్ సమీపంలోని ఓ రిసార్ట్ వేదికైంది.
ఇటలీ నుంచి వచ్చిన మౌరో, స్టెఫానియా దంపతులు.. తమ 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం తాజ్మహల్ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని భావించారు. దీని కోసం వారు ట్రావెల్ ఏజెంట్ మనీశ్ శర్మను సంప్రదించారు. దీంతో తాజ్ మహల్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఆ ఏజెంట్ వివాహానికి ఏర్పాటు చేశాడు. అనంతరం మౌరో, స్టెఫానియా సంప్రదాయ దుస్తుల్లో తాజ్మహాల్ను సందర్శించారు. వివాహం అనంతరం కొత్త జంట అందరితో కలిసి డ్యాన్సులు వేశారు. అయితే 5 ఏళ్లుగా ఇలా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నామని.. ఇప్పుడు ఈ కల నెరవేరిందని ఇటాలియన్ జంట వివరించింది.