తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2021, 11:32 AM IST

ETV Bharat / bharat

చట్టసభల పనితీరుపై జస్టిస్​ రమణ కీలక వ్యాఖ్యలు

కొన్ని చట్టాలను ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయో స్పష్టత ఉండడం లేదని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. ఫలితంగా అనేక వివాదాలు తలెత్తి.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు. చట్టసభల పనితీరులో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ... సామాజిక, ప్రజా జీవితంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు సీజేఐ.

CJI NV Ramana
సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ

పార్లమెంటు చట్టాలు చేసే సమయంలో సరైన చర్చ జరుగుతున్నట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి. రమణ. అర్థవంతమైన చర్చ జరగని కారణంగా ఆ చట్టం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక వివాదాలు తలెత్తి.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు జస్టిస్​ రమణ.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలో సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు జస్టిస్​ రమణ. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో చట్టసభ్యులుగా ఉన్నవారిలో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని గుర్తు చేశారు. అప్పట్లో వారంతా ప్రతి అంశంపైనా విస్తృతంగా, నిర్మాణాత్మకంగా చర్చించి, చట్టాలు చేసేవారని చెప్పారు.

"గతంలో న్యాయస్థానాలపై కేసుల భారం తక్కువగా ఉండేది. ఎందుకంటే.. అప్పట్లో ప్రతి చట్టంపైనా స్పష్టత ఉండేది. ఆ చట్టాలను అర్థం చేసుకోవడంలో, అమలు చేయడంలో ఇబ్బందులు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చట్టాల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉండడంలేదు. ఫలితంగా కేసులు ఎక్కువై.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది.

చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోతే ఇలానే జరుగుతుంది. అందుకే.. సామాజిక, ప్రజా జీవితంలో న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరముంది. మీ(న్యాయవాద) వృత్తికి, డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలన్న ఆలోచనకే పరిమితం అవ్వకండి. ఆలోచించండి. ప్రజా జీవితంలో చురుకుగా ఉండండి. మీ వంతు మంచి పనులు చేయండి. దేశానికి మంచి జరుగుతుంది"

- జస్టిస్ ఎన్​.వి రమణ, సీజేఐ

ఇదీ చూడండి:'హైకోర్టుల అనుమతి ఉంటేనే నేతలపై​ కేసులు వాపస్'

ABOUT THE AUTHOR

...view details