తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IT Raids: 30 చోట్ల ఐటీ సోదాలు.. రూ.125 కోట్లు స్వాధీనం - income tax raid in best bengal

IT Raids News: కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వేళ ఆ రాష్ట్రంలో ఐటీ డిపార్ట్​మెంట్​ సోదాలు కలకలం సృష్టించాయి. పన్ను ఎగవేతపై అసనోల్ మెట్రోపాలిటన్ సిటీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

IT Raids latest News
బంగాల్​లో ఐటీ సోదాలు

By

Published : Dec 21, 2021, 4:25 PM IST

IT Raids: కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఎంసీ విజయోత్సాహాల నడుమ ఆ రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. అసనోల్ మెట్రోపాలిటన్​ సిటీలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. దాదాపు రూ.125 కోట్లకుపైనే లెక్కకు రాని సొమ్మును స్వాధీనం చేసుకుంది. రూ.2 కోట్ల నగదును సీజ్ చేశారు అధికారులు.

పన్ను ఎగవేతపై ఐరన్​ అండ్ స్టీల్​, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్​కు సంబంధించిన రెండు సంస్థల్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు. పట్టణంలో దాదాపు 30 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎస్​డీ కార్డ్​లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details