IT Raids Huawei: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
చట్టాలకు లోబడే..
ఐటీ దాడులపై హువావే స్పందించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపింది. భారత్లో తమ కార్యకలాపాలు చట్టాలు, నియమాలకు లోబడే కొనసాగిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.