తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డోలో-650 మాత్రల తయారీ సంస్థపై ఐటీ దాడులు.. ఒకేసారి 40 చోట్ల..! - డోలో ఐటీ రైడ్స్​

Dolo 650 IT Raid: డోలో- 650 ఔషధాల తయారీ సంస్థపై ఐటీ శాఖ విస్తృత సోదాలు నిర్వహించింది. ఆదాయానికి తగిన పన్ను చెల్లించడం లేదని ఆరోపణల నేపథ్యంలో.. బెంగళూరు రేస్​ కోర్స్​ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్​ లిమిటెడ్​ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

IT Raids Dolo 650 Manufacturer Micro Lab Office in Bengaluru
IT Raids Dolo 650 Manufacturer Micro Lab Office in Bengaluru

By

Published : Jul 6, 2022, 6:50 PM IST

Dolo 650 IT Raid: పాపులర్‌ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, దిల్లీ, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరపగా.. 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

మైక్రో ల్యాబ్స్‌ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ సోదాల్లో భాగంగా మాధవ నగర్‌లోని రేస్‌కోర్సు రోడ్డులోని మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో పలు కీలక పత్రాలు సేకరించినట్టు తెలుస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది.

ABOUT THE AUTHOR

...view details