Actor Vijay IT Raids:పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ స్టార్ హీరో విజయ్ దగ్గరి బంధువు జేవియర్ బ్రిటో నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నై అడయార్‌లోని ఆయన నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు చేశారు. రెండు రోజులుగా ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Actor Vijay IT Raids: హీరో విజయ్ బంధువు ఇంట్లో ఐటీ సోదాలు! - విజయ్ నిర్మాత ఇంట్లో సోదాలు
Actor Vijay IT Raids: పన్ను ఎగవేత ఆరోపణలతో తమిళ హీరో విజయ్ సోదరుడు జేవియర్ బ్రిటో నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఓ మొబైల్ కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు బ్రిటో ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.
హీరో విజయ్ సోదరుని ఇంట్లో ఐటీ సోదాలు!
చైనాకు చెందిన షియోమీ కంపెనీ విడిభాగాల ఎగుమతులు, దిగుమతులను బ్రిటో కంపెనీ నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ఆధారంగా చేసుకుని కంపెనీకి చెందిన 25 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బ్రిటో నివాసంలోనూ సోదాలు జరిపినట్లు వివరించారు.
ఇదీ చూడండి:'ఫొటోలతో బ్లాక్మెయిల్'.. యువకుడిని హత్య చేయించిన పదో తరగతి బాలికలు