దేశంలో కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి బుధవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు స్పందించాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మోదీజీ మంచి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్టు పెట్టింది.
"వెల్డన్ మోదీజీ! దేశాన్ని తీర్చిదిద్దడంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా దూరం ప్రయాణిస్తారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడం మన ప్రజాస్వామ్యం కర్తవ్యం. భాజపా దేశానికి ప్రాముఖ్యత ఇవ్వడం గొప్పవిషయం"
-కాంగ్రెస్
"ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రద్దు చేసినందుకు సంతోషం. 12వ తరగతి పరీక్షలపై కూడా తుది నిర్ణయం తీసుకోవాలి. జూన్ వరకు విద్యార్థులను అనవసరమైన ఒత్తిడికి గురి చేయడం సరికాదు. వాటిపై కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను"
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి