బినామీ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాను రెండో రోజూ ఆదాయ పన్ను శాఖ విచారించింది. దిల్లీలోని వాద్రా కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న దర్యాప్తు బృందాలు ప్రశ్నల వర్షం కురిపించాయి.
సుదీర్ఘ విచారణ
వాద్రాను అధికారులు సోమవారం ఎనిమిది గంటల పాటు విచారించారు. రాజస్థాన్లోని బికనేర్ ప్రాంతంలోని భూమి కొనుగోళ్లకు సంబంధించి వాద్రాను ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ) 2015లో మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం సహా విచారణ కూడా జరిపింది. స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థకు చెందిన రూ.4.62 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసు వివరాలను ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖకు ఈడీ అందించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.