ISRO Scientist Engineer Jobs 2023 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఉద్యోగాలు చేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 61 సైంటిస్ట్/ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 21లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీని తరువాత ప్రకటించనున్నారు.
ఉద్యోగాల వివరాలు
- సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్డీ
- సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్సీ
విద్యార్హతలు
ISRO Scientist Engineer Eligibility : సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులకు స్పేస్ సైన్స్/ అట్మాస్ఫెరిక్ సైన్స్/ ప్లానెటరీ సైన్స్ ప్రధాన సబ్జెక్ట్గా ఎం.ఈ/ఎం.టెక్ లేదా ఎమ్మెస్/ ఎమ్మెస్సీ లేదా బీఈ/ బీటెక్, బీఎస్సీ క్వాలిఫై అయ్యుండాలి.
అప్లికేషన్ ఫీజు
ISRO Scientist Engineer Fee :
- సైంటిస్ట్/ ఇంజినీర్ - SD పోస్టులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
- సైంటిస్ట్/ ఇంజినీర్ - SC పోస్టులకు రూ.750 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, స్త్రీలు కచ్చితంగా రాత పరీక్షకు హాజరు అయితే, అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేస్తారు.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రాతపరీక్షకు హాజరైన తరువాత, బ్యాంకు ఛార్జీలను మినహాయించి, నిర్ణీత సమయంలో రూ.500 రీఫండ్ చేస్తారు.
రాత పరీక్ష
- సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల రాత పరీక్షను హైదరాబాద్, చెన్నై, ఎర్నాకులం, అహ్మదాబాద్, తిరువనంతపురంలో నిర్వహిస్తారు.
- రాత పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.