భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కెే శివన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనితో 2022 జనవరి 14 వరకు ఆయన ఇస్రో చీఫ్‌గా కొనసాగేందుకు అవకాశం కలిగింది.
ఇస్రో ఛైర్మన్ శివన్ పదవీ కాలం పొడిగింపు
ఇస్రో ఛైర్మన్ కే శివన్ పదవీ కాలన్ని మరో ఏడాది పాటు పొడిగించింది కేంద్రం. దీనితో ఆయన 2022 జనవరి 14 వరకు ఇస్రో చీఫ్‌గా కొనసాగనున్నారు. శివన్ 2018 జనవరి 10న ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇస్రో ఛైర్మన్ శివన్ పదవీ కాలం పొడిగింపు
శివన్ 2018 జనవరి 10న ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి ఛైర్మన్‌గా ఉన్న ఏకే కిరణ్ కుమార్ నుంచి జనవరి 14న బాధ్యతలు స్వీకరించారు.