అంతరిక్ష కార్యకలాపాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా.. ఆస్ట్రేలియా, భారత్‌లు అడుగులు వేశాయి. ఇందులో భాగంగా.. ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. గతేడాది చేసిన ఈ ఒప్పంద ప్రకటన ద్వారా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిర్మితమవుతుందని ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పేర్కొంది.
"ఈ ఒప్పందం ద్వారా భారత్, ఆస్ట్రేలియాలు అంతరిక్ష సహకారాన్ని విస్తృతంగా నిర్వర్తిస్తాయి. 2016లో స్పేస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా.. బెంగళూరు స్పేస్ ఎక్స్పో షోలో పాల్గొంది. 2017లో ఇస్రో రాయబారి.. అడిలైడ్‌లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో పాల్గొన్నారు."