తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ మరింత శక్తివంత దేశంగా ఎదగాలి' - భారత్​కు శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్​కు శుభాకాంక్షలు తెలిపాయి. ఇండియా ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ఆకాంక్షించారు.

72nd Republic Day
'భారత్​ మరింత శక్తివంత దేశంగా ఎదగాలి'

By

Published : Jan 26, 2021, 10:33 PM IST

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్​కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కాంక్షించింది అమెరికా.

భారత రాజ్యాంగం ఉన్నతమైనదని అమెరికా కీర్తించింది. దాని వల్లనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్​ పేరుగడించిందని ప్రశంసించింది.

"భారత్​కు 72 వ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల్లోని ప్రజాస్వామ్య సూత్రాల్ని పంచుకోవడం ద్వారా భారత్​ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయి."

- దక్షిమ మధ్య ఆసియా విభాగం, అమెరికా

ఆస్ట్రేలియా, భారత్​ ఒకే దృక్పథం కలిగిన దేశాలు అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ అన్నారు. రెండూ ప్రజాస్వామ్యం కోసం స్వేచ్ఛకోసం పాటుపడతాయని అన్నారు. అలాంటి భారత్​కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్​ చేశారు.

"ఎంత యాదృచ్ఛికమూ ఆస్ట్రేలియా దినోత్సవం కూడా ఈ రోజే. ఇండియా గణతంత్ర దినోత్సవం-ఆస్ట్రేలియా డే ఓకే రోజు రావడం చాలా సంతోషంగా ఉంది."

-స్కాట్​ మోరిసన్​, ఆస్ట్రేలియా ప్రధాని

"భారత ప్రధాని నరేంద్ర మోదీకి 72వ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు. ఇండియా ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలి."

-మహింద రాజపక్స, శ్రీలంక ప్రధాని

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ భారత్​కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

"భారత రాజ్యంగం చాలా గొప్పది. అదే ప్రపంచంలో భారత్​ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చేసింది."

-బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

ఏటేటా ఇరు దేశాల స్నేహం ఇలానే వర్ధిల్లాలంటూ ఇజ్రాయెల్​ ప్రధాని నేతాన్యాహూ ఆకాంక్షించారు. భారత ప్రధాని మోదీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీతో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:ప్రదర్శనకు.. రాజ్యాంగ అసలు ప్రతి

ABOUT THE AUTHOR

...view details