రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ తన కవలలతో భారత్‌కు చేరుకున్నారు. గత నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చిన ఈశా... ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి శనివారం భారత్‌కు వచ్చారు. కవలలకు అంబానీ, పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. చిన్నారుల రాక సందర్భంగా ముకేశ్ అంబానీ సతీసమేతంగా వొర్లిలోని ఈశా దంపతుల నివాసానికి వెళ్లి స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారులు అనంత్ అంబానీ, ఆకాశ్ అంబానీ కూడా ఉన్నారు. ఒక చిన్నారిని ఈశా అంబానీ ఎత్తుకోగా..మరో శిశువును అమ్మమ్మ నీతా అంబానీ ఎత్తుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కవలలతో భారత్‌కు ఈశా.. 300 కిలోల బంగారం దానం చేయనున్న అంబానీ!
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన ఈశా అంబానీ.. తన చిన్నారులతో సహా ముంబయికి చేరుకున్నారు. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ముకేశ్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఆనంద సమయంలో అంబానీ కుటుంబం ప్రశంసనీయమైన నిర్ణయం తీసుకుంది. కవలలు ఇంటికి వచ్చిన సందర్భంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఐదు అనాథ శరణాలయాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతకుముందు, కవలలకు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నుంచి అర్చకులను రప్పించారు.
ఈశా అంబానీ.. కాలిఫోర్నియాలో చిన్నారులకు జన్మనిచ్చినట్లు సమాచారం. కవలలు పుట్టిన వెంటనే ముంబయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం అమెరికాకు వెళ్లింది. అమెరికాలోని ప్రముఖ శిశువైద్య నిపుణుడు డా.గిబ్సన్.. చిన్నారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ కవలల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయికి ఆదియా అని, అబ్బాయికి కృష్ణా అని నామకరణం చేసినట్లు అంబానీ కుటుంబం తెలిపింది. ముకేశ్ కుమారుడు ఆకాశ్ అంబానీకి గతంలో ఓ కుమారుడు జన్మించారు. దీంతో ముకేశ్ రెండోసారి తాత అయినట్లైంది. ముఖేశ్ అంబానీకి ముగ్గురు సంతానం కాగా ఆకాశ్, ఇషాలు(31) కవలలు, మరో కుమారుడు అనంత్ (27).