తెలంగాణ

telangana

ETV Bharat / bharat

bhabanipur election: టీఎంసీ 'అతి'విశ్వాసం- దీదీకి ఓటమి భయం? - tmc bengal news

మరో రాజకీయ సమరానికి తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి(mamata banerjee news), బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నద్ధమయ్యారు(bhabanipur election). సెప్టెంబర్​ 30న జరగనున్న ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఉపఎన్నికలు మమతకు కొత్తేమీ కాదు(tmc bengal news). గతంలో అనేకమార్లు విజయం ఆమెను వరించింది. అయితే ఈ దఫా ఎన్నికల్లో దీదీ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది! ప్రచారాల్లో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, మొత్తం మీద ఆమె వైఖరిని చూస్తుంటే దీదీకి ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు, భాజపా నేతలు విమర్శిస్తున్నారు. అసలు మమత ఏం అంటున్నారు? దీదీకి నిజంగానే ఓటమి భయం పట్టుకుందా? ఉపఎన్నికల్లో ప్రజలు మమతను గెలిపిస్తారా? లేక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 'నందిగ్రామ్​' ఫలితం రిపీట్​ అవుతుందా?

mamata
మమతా బెనర్జీ

By

Published : Sep 24, 2021, 5:18 PM IST

సెప్టెంబర్​ 30న జరగనున్నభవానీపుర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ(mamata banerjee news) ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఓటింగ్​ రోజున.. ప్రజలందరూ పోలింగ్​ బూత్​లకు తరలివెళ్లాలని, 100శాతం పోలింగ్​ నమోదవ్వాలని పదేపదే నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా.. పార్టీ కార్యకర్తలు అతివిశ్వాసంతో ఉన్నారని స్వయంగా దీదీనే అంగీకరించారు.

"ఎమ్మెల్యే స్థానంలో లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టడం సరైనది కాదు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. అందుకే వారు నన్ను గెలిపిస్తారు. టీఎంసీలో సీఎం అయ్యే సామర్థ్యం చాలా మంది నేతలకు ఉంది. కానీ ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టాలని ప్రజలు అనుకుంటే, కచ్చితంగా నాకే ఓటువేయాలి."

-- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం.

ఇవన్నీ చూస్తుంటే.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టే.. ఈసారీ ఓడిపోతాననే భయం.. మమత ఉన్నట్టు కనిపిస్తోందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు(bhabanipur by election 2021).

మమతా బెనర్జీ

ఇదీ చూడండి:-Bhabanipur Election: దెబ్బతిన్న పులి X ధైర్యవంతురాలు

ఇదే విషయంపై ప్రతిపక్ష భాజపా(bjp bengal news).. టీఎంసీపై విమర్శలు సంధించింది. ఈటీవీ భారత్​తో మాట్లాడిన భాజపా ప్రధాన కార్యదర్శి శ్యనాతన్​ బాసు.. మమత వైఖరి చూస్తుంటే.. ఆమెకు ఓటమి భయం పట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

భాజపా అభ్యర్థి ప్రియాంక

"అసెంబ్లీలో టీఎంసీకి మెజారిటీ ఉంది. అందువల్ల భవానీపుర్​ ఉపఎన్నికకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం పడిపోతుందేమో అన్న భయం లేదు. మమత కాకాపోతే, మరొకరు సీఎం అవ్వొచ్చు. ఇలాంటి సమయంలో దీదీ ప్రశాంతంగా ఉండాలి. కానీ ఆమె వైఖరిని చూస్తుంటే అలా లేదు. మమతకు ఓటమి భయం పట్టుకున్నట్టు ఉంది."

--- శ్యనాతన్​ బాసు, భాజపా ప్రధాన కార్యదర్శి.

పార్టీ మొత్తం ఒక్కరిపైనే ఆధారపడితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని సీపీఎం మండిపడింది.

"టీఎంసీకి 213 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరితో బలవంతంగా రాజీనామా చేయించారు. తాను సీఎంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో ఇలా చేశారు. కరోనా సంక్షోభంలోనూ ప్రజలు మరోసారి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. అది మమత వల్లే."

--- రాబిన్​ దేవ్​, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు.

అటు రాజకీయ నిపుణులు కూడా మమతకు ఓటమి భయం పట్టుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'నందిగ్రామ్​లో ఓటమి తర్వాత.. సీఎం అసలు దేనినీ వదిలిపెట్టడం లేదు. లోలోపల ఓటమి భయం ఉంటేనే.. బయటకు ఇలా కనిపిస్తారు. తన గెలుపుపై దీదీకే నమ్మకం లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నందిగ్రామ్​ ఓటమిని జీర్ణించుకోలేకే, దీదీ ఇలా మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తోంది,' అని అభిప్రాయపడ్డారు ప్రముఖ రాజకీయ నిపుణులు డా. అమల్​ కుమార్​ ముఖోపాధ్యాయ్​.

ఉప ఎన్నికలకు నామినేషన్​ వేస్తూ..

ఇదీ చూడండి:-సొంతిల్లు, సొంత వాహనం లేని ముఖ్యమంత్రి

కోల్​కతా వర్సిటీ మాజీ రిజిస్ట్రార్​ రాజగోపాల్​ ధార్​ చక్రవర్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

"గతంలో జరిగిన ఉపఎన్నికల్లో మమత విజయం సాధించారు. ఈ లెక్కన చూసుకుంటే ఈసారీ దీదీ సునాయాసంగా గెలుస్తారు. అయితే గత ఎన్నికల అనుభవాలు దీదీని వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో టీఎంసీకి భాజపా గట్టి షాకిచ్చింది. టీఎంసీపై ఆధిపత్యం చెలాయించి.. మమత ధీమాగా ఉన్న నియోజకవర్గాల్లోనూ దాదాపు గెలిచినంత పని చేసింది. అటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చింది. ఈ పరిణామాల కారణంగానే, మళ్లీ ఓటమి పాలవ్వకూడదని మమత మరింత జాగ్రత్త వహిస్తున్నట్టు కనిపిస్తోంది."

--- రాజగోపాల్​ ధార్​ చక్రవర్తి, కోల్​కతా వర్సిటీ మాజీ రిజిస్ట్రార్​

మరోవైపు విమర్శలను తిప్పికొట్టే పనిలో పడింది టీఎంసీ(tmc bengal news). తన మాటలను, ఎవరు.. ఎలా విశ్లేషించినా మమత పట్టించుకోరని తేల్చిచెప్పింది.

ఉపఎన్నికలో గెలిస్తేనే...

2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రామ్​ నుంచి బరిలో దిగారు. కానీ.. తన ప్రత్యర్థి, టీఎంసీని వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. వాస్తవానికి భవానీపుర్​.. మమత సొంత నియోజకవర్గం. దీనిని కాదనుకుని, సువేందుపై ప్రతీకారం కోసం నందిగ్రామ్​లో పోటీచేశారు. భవానీపుర్​లో టీఎంసీ అభ్యర్థి గెలవడం మమతకు కలిసివచ్చింది. ఎన్నికల అనంతరం, దీదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా అక్కడ ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో మమత గెలవడం అనివార్యం.

ఇదీ చూడండి:-భవానీపుర్​లో మమత ఎన్నిక లాంఛనమేనా?

ABOUT THE AUTHOR

...view details