తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కీలక నేతల 'ఘర్​ వాప్సీ'- అయోమయంలో భాజపా - tmc latest news

బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి భాజపాలో చేరిన నేతలు కొందరు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. తాము తప్పు చేశామని తిరిగి సొంతగూటికి వచ్చేందుక సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో మరో కీలక నేత చేరే అవకాశం కనిపిస్తోంది. భాజపా వైఖరిని తప్పుబడుతూ ఆయన ట్వీట చేయడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.

Is Rajib Banerjee going back to TMC?
కీలక నేతల 'ఘర్​ వాప్సీ'- అయోమయంలో భాజపా

By

Published : Jun 9, 2021, 8:15 PM IST

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడిచినా అక్కడి రాజకీియ పరిణామాలు మాత్రం ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఎన్నికలకు కొన్ని రోజులు ముందు తృణమూల్ కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన చాలా మంది నేతలు సొంతగూటికి వచ్చేందుకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. తాము తప్పు చేశామని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ముకుల్ రాయ్, రాజీవ్ బెనర్జీ వంటి కీలక నేతలు కూడా తిరిగి టీఎంసీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. భాజపా నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశానికి ఈ ఇద్దరు నేతలు గైర్హాజరు అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్.. తనకు సమావేశం గురించి ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని తెలిపారు. బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోశ్ మాత్రం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముకుల్​కు ఈ భేటీ జరుగుతుందని తెలుసన్నారు.

రాజీవ్ ట్వీట్ దుమారం..

మరోవైపు తన బంధువు అనారోగ్యంగా ఉన్న కారణంగానే సమావేశానికి హాజరుకాలేకపోయాని మరో కీలక నేత, మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ వివరణ ఇచ్చారు. అనంతరం సొంత పార్టీ నేత సువేందు అధికారిపై విమర్శలు గుప్పించారు. బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలనే భాజపా నేతల వ్యాఖ్యలను ప్రజలు అంత తేలిగ్గా తీసుకోరని, భారీ మెజార్టీతో వారు ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలు కరోనా, వరదల ప్రభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థిలో రాజకీయాలకు అతీతంగా అందరూ సమష్టిగా ప్రజలకు సాయం అందించాలని ట్వీట్​ చేశారు.

ముకుల్​కు టీఎంసీ సాయం!

తమ కుటుంబం కష్ట సమయంలో ఉన్నప్పుడు సాయం అందించిన సీఎం మమతా బెనర్జీకి ముకుల్ రాయ్ కుమారుడు, శుభ్రాంగ్షు రాయ్ గతవారం ఫేస్​బుక్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్​ సతీమణిని, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరామర్శించారు. ఈ పరిణామాలతో రాయ్​ మళ్లీ టీఎంసీలో చెరొచ్చని భావిస్తున్నారు. తృణమూల్​ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ రాయ్​.. 2017లో పార్టీని వీడి భాజపాలో చేరారు.

సొంతగూటికి చేరడానికి ముందు వరుసలో ఉన్న నేతల్లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యేలు సోనాలి గుహ, దీపేందు బిశ్వాస్ ఉన్నారు.

బహిరంగ క్షమాపణలు..

బీర్​భూం జిల్లాలో మాజీ టీఎంసీ కార్యకర్తలు కొందరు తాము పార్టీలోకి తిరిగొచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. భాజపాలో చేరి తప్పుచేశామని బహిరంగంగా క్షమాణలు చెప్పారు. దీనిపై స్పందించిన కమలనాథులు.. భయంతోనే వారు ఇలా చేశారని ఆరోపించారు. టీఎంసీ పాలనలో క్షేత్ర స్థాయి కార్యకర్తలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు.

హుటాహుటిన దిల్లీకి ఎంపీలు..

పార్టీ పంపిన అత్యవసర సమన్లకు స్పందనగా ముగ్గురు భాజపా ఎంపీలు అర్జున్ సింగ్, సౌమిత్రా ఖాన్​, నిశిత్​ ప్రామాణిక్ హుటాహుటిన దిల్లీ వెళ్లారు. బంగాల్​ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై చర్చించేందుకే వారిని దిల్లీ రమ్మని అధిష్ఠానం పిలిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ముగ్గురు ఎంపీలు కేంద్రానికి మెమొరాండం సమర్పిస్తారని తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఏఏ అమలుపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: 'దీదీ.. మిమ్మల్ని విడిచి నేను బతకలేను'

సోనాలీ బాటలో సరళ.. మమతకు క్షమాపణ

ABOUT THE AUTHOR

...view details