Is Netaji dead or alive: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీపై తమ వైఖరిని వెల్లడించాలని కేంద్రాన్ని అదేశించింది కోల్‌కతా హైకోర్టు. చంద్రబోస్ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశించింది.
ఓ పిల్‌పై సోమవారం విచారణ చేపట్టిన అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవతో కూడిన బెంచ్.. ఈ ఆదేశాలు జారీ చేసింది. భారతీయ కరెన్సీలో సుభాష్ చంద్రబోస్ ఫొటోలను వినియోగిస్తారా? అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.