తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ISIS Attack in India: భారత్​పై ఐసిస్ గురి- ఎన్ఐఏ హెచ్చరిక - ఇస్లామిక్ స్టేట్ వార్తలు

అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్​.. భారత్​లో పాగా వేసేందుకు(ISIS in India) విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఎన్​ఐఏ వెల్లడించింది. 37 కేసులను విచారించిన అనంతరం ఈ నిర్ధరణకు వచ్చింది. ఆన్​లైన్​లో నిరంతర ప్రచారం ద్వారా యువతకు గాలం (isis recruitment in india )వేస్తున్నట్లు పేర్కొంది.

ISIS  is trying to spread its tentacles in India through continuous propaganda online
భారత్లో ఐసిస్... ఎన్ఐఏ హెచ్చరిక

By

Published : Sep 17, 2021, 5:35 PM IST

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ తన సామ్రాజ్యాన్ని భారత్​లో విస్తరించేందుకు(ISIS in India) కుట్రలు చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రకటించింది. ఐసిస్​ సిద్ధాంత స్ఫూర్తితో జరిగిన దాడులు(ISIS attack in india), కుట్రలు, ఉగ్ర నిధులకు సంబంధించి మొత్తం 37 కేసులను విచారించి ఈ నిర్ధరణకు వచ్చింది. ఆన్​లైన్​లో నిరంతరం ప్రచారం నిర్వహిస్తూ భారత యువతకు గాలం వేసేందుకు ఐసిస్ విశ్వ ప్రయత్నాలు(isis recruitment in india ) చేస్తోందని ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది.

తమ సమీప ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎవరికైనా కొంచెం అనుమానం వచ్చినా వెంటనే 011-24368800 నంబరుకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

ఉగ్రకార్యకలాపాలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని(isis india arrest ) విచారిస్తున్నారు.

ఐసిస్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థ. అఫ్గాన్​లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ సంస్థ మళ్లీ బలపడుతుందని భద్రతా నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. పొరగు దేశమైన భారత్​లోకి చొరబడేందుకు(ISIS in kashmir ) కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం..

ABOUT THE AUTHOR

...view details