IRCTC train booking: ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ ద్వారా ట్రైన్ టికెట్లు కొనుగోలు ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ ఐడీతో ఆధార్ లింక్ చేసిన వారు.. వెబ్సైట్, యాప్ ద్వారా ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆధార్ లింక్ కానీ వారు 12 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా ఆధార్ లింక్ కాని వారు ఆరు టికెట్లు, ఆధార్ అనుసంధానం చేసుకున్న వారు 12 టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం ఆ పరిమితిని పెంచింది.
" ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ యూజర్ ఐడీతో ఆధార్ అనుసంధానించని ఖాతా ద్వారా ఇప్పటి వరకు ఉన్న గరిష్ఠ పరిమితి 6 టికెట్ల నుంచి 12 టికెట్లకు పెంచింది. ఆధార్ అనుసంధానించిన ఖాతా ద్వారా ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితి 12 నుంచి 24 టికెట్లకు పెంచింది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులను ఆధార్‌తో ధ్రువీకరించేందుకు వీలుంటుంది."
- రైల్వే శాఖ