IRCTC Punya Kshetra Yatra Details in Telugu:తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ఆపరేట్ చేసిన పుణ్యక్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) టూర్ ప్యాకేజీకి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు ఈ యాత్ర జరిగింది. కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించడంతో ఐఆర్‌సీటీసీ టూరిజం పుణ్య క్షేత్ర యాత్ర టూర్‌ను మరోసారి ప్రకటించింది. అక్టోబర్ 12న ఈ యాత్ర ప్రారంభం కానుంది.
ఈ టూర్ ప్యాకేజీలో పలు రాష్ట్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్నవారు పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. సుమారు 9 రోజుల పాటు సాగే ఈ టూర్.. అందుబాటు ధరలోనే లభించడం విశేషం. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి!
IRCTC Punya Kshetra Yatra Full Package Details: ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో భారత్ గౌరవ్ టూరిస్ట్(Bharat Gaurav Tourists Train) రైలు ఎక్కొచ్చు. ఈ రైలు తెలంగాణలో కాజీపేట, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ , ఏలూరు, రాజమండ్రి , సామర్లకోట, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. మొదటి రోజంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు మాల్తీపాత్‌పూర్‌లో దిగాలి. అక్కడి నుంచి పూరీ వెళ్లి జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలి. రాత్రికి పూరీలో బస చేయాలి.
మూడో రోజు కోణార్క్ టూర్ ఉంటుంది. కోణార్క్‌లో సూర్యదేవుని ఆలయాన్ని దర్శించవచ్చు. ఆ తర్వాత గయ బయల్దేరాలి. నాలుగో రోజు పర్యాటకులు గయ చేరుకుంటారు. గయలో బోధ్ గయ మహాబోధి ఆలయం, విష్ణుపాద ఆలయం చూడొచ్చు. రాత్రికి గయలో బస చేయాలి. ఐదో రోజు వారణాసికి బయల్దేరాలి. సార్‌నాథ్ టూర్ ఉంటుంది. రాత్రికి వారణాసిలో బస చేయాలి. ఆరో రోజు కాశీ టూర్ ఉంటుంది. కాశీలో విశ్వనాథ ఆలయం, వారణాసి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాల సందర్శన ఉంటుంది. సాయంత్రం గంగా హారతి దర్శించుకోవచ్చు. ఆ తర్వాత అయోధ్య బయల్దేరాలి.
Best 5 Train Ticket Booking Apps : ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!
అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌గఢి చూడొచ్చు. సరయూ నదీతీరంలో హారతి దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ఎనిమిదో రోజు ప్రయాగ్‌రాజ్ టూర్ ఉంటుంది. త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన్ మండపం చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.