IRCTC Hyderabad to Tirumala Tour Package :మీరు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. "గోవిందం" పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతి స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించింది.
Govindam Tirupati Tour Package :'గోవిందం' పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్లో భాగంగా తిరుపతి, తిరుమలలోని బాలాజీ ప్రధాన ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయాలు కవర్ అవుతాయి. అలాగే.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్(Tirumala Special Entry Darshanam) కూడా ఈ టూర్ ప్యాకేజీలో అందిస్తారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ తర్వాత మరో స్టాప్‌గా నల్గొండ రైల్వేస్టేషన్ మాత్రమే ఉంటుంది. ఈ మూడు స్టేషన్లలో ఎక్కడ ఎక్కాలనుకుంటే అక్కడ ఎక్కొచ్చు.
టూర్ సాగనుందిలా..
మొదటిరోజు : హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ట్రైన్ బయలుదేరుతుంది. అనంతరం 6 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ నుంచి నల్గొండకు వెళుతుంది. రాత్రి 7 గంటల 38 నిమిషాలకు బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.
Vande Bharat Express : 16 బోగీలతో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రెండో రోజు :తిరుపతి(Tirupati)కి రెండో రోజు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు రైలు చేరుకుంటుంది. అక్కడ ప్రయాణికులను ఐఆర్సీటీసీ వాళ్లు పికప్ చేసుకుని.. త్రీ స్టార్ హోటల్‌కి తీసుకెళ్తారు. అక్కడ ఏసీ రూమ్ సౌకర్యం కల్పిస్తారు. అనంతరం హోటల్లో ఫ్రెష్ అప్, టిఫెన్ అయిన తర్వాత.. ఉదయం 8 గంటల సమయంలోతిరుమల(Tirumala)శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనానికి తీసుకెళ్తారు. అక్కడ దర్శనం అనంతరం హోటల్‌కు చేరుకుని లంచ్ చేస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక అదే రోజు సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్(Tirupati Railway Station) నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు రాత్రంతా జర్నీలో ఉంటారు.
మూడో రోజు :తిరుగుప్రయాణంలో మూడోరోజు ఉదయం 3గంటల 4 నిమిషాలకు నల్గొండకు చేరుకుంటారు. 5గంటల 35 నిమిషాలకు సికింద్రాబాద్, 6 గంటల 55 నిమిషాలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ చేరుకోవడంతో మీ టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరాలు ఇవీ..
- ఈ "గోవిందం" టూర్ ప్యాకేజీ(Govindam Tour Package) లో టికెట్ ధరగా.. ఒక్కరికి 3,800 రూపాయలుగా నిర్ణయించారు.
- 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు ఈ టూర్లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
- కాకపోతే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
- ప్రతి ఒక్కరూ ఒరిజినల్ ఆధార్‌కార్డు కలిగి ఉండాలి.
TTD Varalakshmi Vratham Tickets : తిరుమలలో వరలక్ష్మీ వ్రతం.. టికెట్లు విడుదల.. బుక్ చేసుకోండిలా
How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?