IRCTC Hyderabad To Shirdi Tour Packages Full Details : తక్కువ ధరలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు జనాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగానే.. హైదరాబాద్ టూ షిరిడీ రెండు ప్యాకేజీలను అనౌన్స్ చేసింది. సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్, సాయి శివం పేర్లతో IRCTC టూరిజం ఈ టూర్లను ఆపరేట్ చేస్తోంది. మరి ఈ టూర్లు ఎన్ని రోజులు సాగుతాయి..? టికెట్ల ధర ఎంత..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Sai Sannidhi Ex Hyderabad Tour Full Details: సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ (SAI SANNIDHI EX HYDERABAD) టూర్ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.
IRCTC Divya Dakshin Yatra and How to Book Online: ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీ.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఇప్పుడే బుక్ చేసుకోండిలా.!
ఐఆర్‌సీటీసీ ‘సాయి సన్నిధి’ ప్రయాణం ఇలా..
- మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:50 గంటలకు ట్రైన్ (అజంతా ఎక్స్‌ప్రెస్) ఉంటుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళుతుంది. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వడం.. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం ఉంటుంది. అక్కడ నుంచి శని శింగణాపూర్ బయలుదేరుతారు. శని ఆలయం దర్శనం అనంతరం నాగర్‌సోల్‌కు బయలుదేరుతారు. తిరుగు ప్రయాణం నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 09:20 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- మూడో రోజు ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర:
- స్టాండర్డ్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8,510 డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,840, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.3,710గా ధర నిర్ణయించారు.
- కంఫర్ట్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,100గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,400గా నిర్ణయించారు.
- ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం, శని శింగణాపూర్, రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి.
How To Book Entire Coach In Train : ఫ్యామిలీతో టూర్ వెళ్తున్నారా?.. తక్కువ ధరకే మొత్తం కోచ్‌నే బుక్ చేసుకోండిలా!
ఆన్లైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://www.irctctourism.com/
- హోమ్ పేజీలో Tour Packages ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం West India Packages ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి.
- తర్వాత SAI SANNIDHI EX HYDERABADలో Book Now ఆప్షన్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలను ఎంటర్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి.
సాయి శివం టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు:
Sai Shivam Tour Package Full Details:సాయి శివం (Sai Shivam) టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్ చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.
How To Change Train Journey Date : ట్రైన్ జర్నీ తేదీ మార్చాలా?.. పై క్లాస్‌కు అప్‌గ్రేడ్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
ఐఆర్‌సీటీసీ ‘సాయి శివం’ ప్రయాణం ఇలా..
- మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 06:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064(అజంతా ఎక్స్‌ప్రెస్)లో ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే బస చేయాలి.
- మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి నాసిక్ వెళ్లాలి. అక్కడ త్రయంబకేశ్వర్, పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
- నాలుగో రోజు 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్ టికెట్‌ను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా?
టూర్ ప్యాకేజీ ధర:
- స్టాండర్డ్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,730 డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,910గా ధర నిర్ణయించారు.
- కంఫర్ట్ క్లాస్‌లో.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,420గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,230, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6590గా నిర్ణయించారు.
- టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శన స్థలాలకు ఏసీ వాహనంలో తీసుకెళ్తారు. అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రయాణ ప్రణాళిక ప్రకారం అన్ని సందర్శనా స్థలాలు కవర్ అవుతాయి. అదే విధంగా నిబంధనలు వర్తిస్తాయి. అదనంగా ఏదైనా కావాలంటే వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలి.
ఆన్లైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..?
- ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. https://www.irctctourism.com/
- హోమ్ పేజీలో Tour Packages ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం West India Packages ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి.
- తర్వాత Sai Shivamలో Book Now ఆప్షన్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలను ఎంటర్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి.
Best 5 Train Ticket Booking Apps : ఆన్లైన్లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!
How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?
Travel in Third AC Class with Sleeper Ticket : వావ్.. సూపర్ స్కీమ్! స్లీపర్ క్లాస్ టికెట్‌తో.. ఫ్రీగా థర్డ్ ఏసీ జర్నీ!