Passenger Train Derailed: తూర్పు ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎడారి నగరమైన తబాస్ సమీపంలో తెల్లవారుజామున.. ఏడు బోగీలు ఉన్న రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్ సరిగ్గా లేని ఘటనాస్థలికి మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
పట్టాలు తప్పిన రైలు.. 17 మంది మృతి.. 50 మందికిపైగా గాయాలు - ఇరాన్ రైలు
09:29 June 08
పట్టాలు తప్పిన రైలు.. 17 మంది ప్రయాణికులు మృతి.. 50 మందికిపైగా గాయాలు
రైలు పట్టాలకు సమీపంలో ఉన్న ఎస్కవేటర్‌ను రైలు బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే రాత్రి సమయంలో ఎస్కవేటర్ అక్కడ ఎందుకు ఉందో స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. ఏదైనా మరమ్మత్తు ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ ఉందేమోనని అనుమానిస్తున్నారు.
ఇరాన్లో ఏడాదికి సగటున 17,000 మంది ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ విస్మరించి వాహనాలు నడపడం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:పబ్జీ ఆడొద్దన్న తల్లిని కాల్చి చంపిన బాలుడు.. లూడోలో నష్టపోయి ఆత్మహత్య
''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్ తెగువకు సలాం'