మాఫియా నేత ఇక్బాల్ మిర్చికి చెందిన ముంబయిలోని రూ.500 కోట్ల విలువైన మూడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. స్మగ్లింగ్, మాదకద్రవ్యాల సరఫరా, విదేశీమారక ద్రవ్య అక్రమాల నిరోధక చట్టాల కింద ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది ఈడీ.
ఇక్బాల్ మిర్చి ఆస్తులు స్వాధీనం: ఈడీ - మాఫియా నేత ఇక్బాల్ మిర్చి
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడైన ఇక్బాల్ మిర్చి ఆస్తులను జప్తు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ముంబయిలో ఇక్బాల్‌కు చెందిన రూ. 500 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.
![ఇక్బాల్ మిర్చి ఆస్తులు స్వాధీనం: ఈడీ Iqbal Mirchi's assets worth Rs 500 crore seized by ED in Mumbai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9587382-109-9587382-1605747088512.jpg)
ఇక్బాల్ మిర్చి ఆస్తుల స్వాధీనం: ఈడీ
ఇక్బాల్‌కు సంబంధించిన వర్లి ప్రాంతంలోని మూడు భవనాల(స్థిరాస్తులు)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు. దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా భావించే ఇక్బాల్ మిర్చి 2013లో లండన్‌లో చనిపోయాడు.
ఇదీ చదవండి:దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంపాట