IPPB Jobs : ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. రూ.30వేల జీతం.. పోస్టింగ్ ఎక్కడంటే? - ఐపీపీబీ బ్యాంక్ జాబ్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
IPPB Jobs 2023 : బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎదురుచూసే ఆశావాహులకు గుడ్ న్యూస్. ఐపీపీబీ-ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మరి ఎన్ని పోస్టులు, జీతభత్యాల ఎలా ఉంటాయి, దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఎప్పుడు తదితరాలు మీ కోసం..
ప్రభుత్వ బ్యాంకులో 132 కోలువులు.. రూ.30 వేల జీతం.. పోస్టింగ్ ఎక్కడంటే..
By
Published : Jul 30, 2023, 10:56 AM IST
IPPB Job Recruitment 2023 : ప్రభుత్వ బ్యాంకులో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కలలు కనే పట్టభద్రులకు శుభవార్త. ఐపీపీబీ-ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులోని మొత్తం 132 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
IPPB Job Selection Process : రాతపరీక్ష (ఆన్లైన్)
గ్రూప్ డిస్కష్షన్
పర్సనల్ ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్..
సర్కిల్
ఖాళీలు
అసోం
26
ఛత్తీస్‌గఢ్
27
హిమాచల్ ప్రదేశ్
12
జమ్మూకశ్మీర్/లద్ధాఖ్
7/1
అరుణాచల్ ప్రదేశ్
10
మణిపుర్
9
మేఘాలయ
8
మిజోరం
6
నాగాలాండ్
9
త్రిపుర
5
ఉత్తరాఖండ్
12
దరఖాస్తు చివరితేదీ.. IPPB Jobs Last Date : 2023 ఆగస్టు 16. అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 31.
వీరికి ప్రాధాన్యత.. IPPB Recruitment 2023 : బ్యాంకింగ్ రంగంలోని ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్‌కు సంబంధించి సేల్స్ లేదా ఆపరేషన్స్ విభాగంలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక సమయంలో ప్రాధాన్యత ఉంటుంది.
ఇన్ని ప్రశ్నలు.. ఇంత సమయం.. IPPB Recruitment 2023 Notification : మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు. 120 నిమిషాల పరీక్షా సమయం. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ప్రతి ఒక్త తప్పు సమాధానానికి 0.25 మార్కును తీసేస్తారు.