IPL illegal streaming: సరైన అనుమతులు లేకుండా క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న వెబ్సైట్లపై దిల్లీ హైకోర్టు కొరడా ఝులిపించింది. ఇలా అన్లైన్ ప్రసారాలకు పాల్పడుతున్న వెబ్సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని ఆదేశించింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను దృష్టిలో ఉంచుకొని దిల్లీ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.
మార్చి 26 నుంచి ప్రారంభంకానున్న టాటా ఐపీఎల్-2022కు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఇతరుల పెట్టుబడులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా ప్రసారాలు చేస్తున్న వెబ్సైట్లను వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
- http://live.flixhub.net
- nlive.flixhub.net
- http:titichsports.com
- nstitichsports.com
- http://vipleague.im
- nvipleague.im
- maxsport.one
- http://t20wc.nl
- nt20wc.nl
- http://vipstand.se
- nvipstand.se
- stream.btolat.online
పైన పేర్కొన్న వెబ్సైట్లతో పాటు మరి కొన్నింటిని కూడా బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అధికారులకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి మాత్రమే గాక మరే ఇతర వెబ్సైట్లు టాటా ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా లేక అనధికారికంగా ప్రసారం చేస్తే.. అందుకు సంబంధించిన సాక్ష్యాలతో ఫిర్యాదుదారులు అఫిడవిట్ దాఖలు చేయవచ్చని పేర్కొంది.