IOCL Apprentice Jobs 2023 :ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్). టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1603 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ట్రేడుల్లో పోస్టులు(IOCL Apprentice Job Vacancy Trades)!
- టెక్నీషియన్ అప్రెంటిస్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్
- ట్రేడ్ అప్రెంటిస్(టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్)- ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్
వయోపరిమితి(IOCL Apprentice Jobs Age Limit)!
- 2023 నవంబర్ 30 నాటికి అభ్యర్థులు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతో పాటు దివ్యాంగులకు కొన్ని వయోపరిమితి సడలింపులను కల్పించారు.
కావాల్సిన అర్హతలు(IOCL Apprentice Jobs Eligibility)!
- బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
- సంబంధిత విభాగంలో సాంకేతిక నైపుణ్యం
- క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ సహా రీజనింగ్ ప్రశ్నలు పరిష్కరించే సామర్థ్యం
- బేసిక్ ఇంగ్లిష్ తెలిసి ఉండాలి
- ఆన్లైన్ టెస్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 35 శాతం మార్కులు స్కోర్ చేస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ(IOCL Apprentice Jobs Selection Process)!
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్
- ఆన్లైన్ టెస్టులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది.
ట్రైనింగ్ వ్యవధి(IOCL Apprenticeship Training Period)!
- రిటైల్ సేల్స్ అసోసియేట్- 6 నెలలు
- మిగతా అన్ని ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 12 నెలల శిక్షణ