బాంబు బెదిరింపుతో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన అంతర్జాతీయ విమానంలో బాంబు లేదని అధికారులు గుర్తించారు. అతి కేవంల బెదిరింపు కాల్ మాత్రమే అని తేల్చారు. ఈ మేరకు జామ్‌నగర్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. "ఎన్ఎస్జీ టీమ్, పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలతో.. విమానాన్ని, ప్రయాణికులను, అందులో ఉన్న బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాము. ఈ తనిఖీలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9.50 గంటల వరకు కొనసాగించాము. అందులో అనుమానాదాస్పదంగా ఏం లభ్యం కాలేదు. గోవా వెళ్లేందుకు ఆ విమానానికి క్లియరెన్స్ ఇచ్చాము. అందులో ఉన్న ప్రయాణికులు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు" అని కలెక్టర్ తెలిపారు.
విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
ఓ అంతర్జాతీయ విమానాన్ని బాంబు బేదిరింపుతో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఏం లభించలేదని.. టేకాఫ్‌కు క్లియరెన్స్ ఇచ్చామని అధికారులు తెలిపారు.
సోమవారం అజుర్ ఎయిర్‌కు చెందిన అంతర్జాతీయ విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబు బెదిరింపు రావడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జామ్‌నగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడం వల్ల వెంటనే అప్రమత్తమైన అక్కడి జిల్లా కలెక్టర్‌తో పాటు మిగతా పోలీసు అధికారులు విమానాశ్రాయానికి చేరుకున్నారు. వెంటనే ప్లేన్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేలా అదేశాలు జారీ చేశారు. దీంతో అందులో ఉన్న 236 ప్రయాణికుల ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వీరు ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.