తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Two suicide in Triangle love ఇది మరో 'బేబీ' కథ..! విధి రాసిన మూడుముక్కలాటలో ఇద్దరు బలి! - విశాఖ లేటెస్ట్ న్యూస్

Inter Student Suicide in Visakha: విశాఖలో మరో 'బేబీ' కథ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కథలో ఇద్దరు ప్రాణాలను కోల్పోగా.. మరొకరు కటకటాలపాలయ్యారు. ఈ ఘటనలో లభించిన సూసైడ్ లేఖలోని విషయాలు మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Inter_Student_Suicide_in_Visakha
Two suicide in Triangle love విధి రాసిన మూడుముక్కలాటలో ఇద్దరు బలి!

By

Published : Aug 13, 2023, 5:40 PM IST

Updated : Aug 13, 2023, 7:34 PM IST

Inter Student Suicide in Visakha: విశాఖలో 'బేబీ' సినిమా తరహా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రేమ కథ.. మైనర్ బాలిక, యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. మరో యువకుడిని కటకటాలపాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సూసైడ్ నోట్ కీలకంగా మారడంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి.. నిందితుడిని రిమాండ్​కు తరలించారు. అసలేం జరిగిందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జీవీఎంసీ 89వ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని(17)కి.. ఇందిరా నగర్​కు చెందిన డ్యాన్సర్ సాయికుమార్(23), ఆదర్శనగర్​కు చెందిన సూర్యప్రకాశరావు(25)తో బాలికకు పరిచయం ఏర్పడింది. వారిలో సాయికుమార్​తో సదరు బాలిక తాళికట్టించుకున్న వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ప్రసుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతోపాటు సూర్యప్రకాశరావుతోనూ బాలిక సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే బాలిక ఒకరి తెలియకుండా మరొకరితో సాగిస్తోన్న ప్రేమ వ్యవహారం బయటపడటంతో.. ఇద్దరు యువకులు బాలిక ఇంటి వద్దకు వెళ్లి.. ఆమెకు ఎవరు కావాలో..?ఎవరితో ఉంటుందో..? తేల్చుకోమని హెచ్చరించారు.

Couple Suicide Attempt: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్..!

దీంతో ఏం చేయాలో అర్థంకాని బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఈ నెల 10న ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మైనర్ బాలిక మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్​ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అందులో.. 'సూర్య.. వాళ్లెవరినీ వదలకు.. కుక్క చావు చావాలి కొడుకులు..' అని రాసిపెట్టి ఉంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న సూర్యప్రకాశ్ గురువారం రాత్రి అకస్మాత్తుగా అదృశ్యమైయ్యాడు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం గోపాలపట్నం సమీప రైల్వే పట్టాలపై శవమై కనిపించాడంతో.. ఈ కథలో రెండో ఆత్మహత్య నమోదు అయ్యింది.

ఒకే చున్నీ కట్టుకుని.. నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య!

అయితే మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు కనిపించకపోవటంతో.. గుర్తు తెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం డెడ్​బాడీని కేజీహెచ్​కు తరలించారు. అయితే అది సూర్యప్రకాశ్​ రావు మృతదేహంగా అతడి కుటుంబీకులు గుర్తించారు. దీంతో సూర్యప్రకాశ్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. బాలిక ఆత్మహత్య నేపథ్యంలో భయపడి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనలో మరో నిందితుడు సాయికుమార్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్​కు తరలించారు. అయితే పోలీసులకు లభించిన సూసైడ్ నోట్​లో 'సూర్య.. వాళ్లెవరినీ వదలకు.. కుక్క చావు చావాలి..' అని రాసిఉన్న దానిలో మిస్టరీ మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. బాలిక ఎవరిని వదొలొద్దు అంది..?ఎవరిని ఉద్దేశించి.. కుక్క చావు చావాలని కోరుకుంది..? అనే ప్రశ్నలు నెటిజన్లలో తలెత్తుతున్నాయి.

కాలేజీలోనే ప్రేమ పెళ్లి.. యూత్​ ఫెస్టివల్​లో అంతా షాక్​

Last Updated : Aug 13, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details