బిహార్‌లోని నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. 500 విద్యార్థినుల మధ్య పరీక్ష రాసేందుకు కూర్చోబెట్టడం వల్ల ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష హాల్లోనే స్పృహతప్పి పడిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. బ్రిలియంట్ కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్లో వెలుగుచూసింది ఈ విచిత్ర ఘటన.
ఇదీ జరిగింది..
మనీశ్ శంకర్(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ సుందరగడ్లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకొచ్చాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం మ్యాథ్‌మెటిక్స్ పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్లోకి వెళ్లాడు. పరీక్ష హాల్లో ఉన్న బాలికలను చూసి ఒక్కసారి స్పృహతప్పిపడిపోయాడు మనీశ్ శంకర్.