రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతుడి రూంలో సూసైడ్ నోట్ సైతం లభ్యమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా మృతుడు, అతని కుటుంబ సభ్యులు.. కుల్లూ జిల్లా బంజారా ఏరియాలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 17 సంవత్సరాలు ఉంటాయి. అతడికి రాత్రిపూట పదే పదే పీడకలలు వచ్చేవి. దీంతో మృతుడు విపరీతంగా ఆందోళన చెందాడు. గత ఏడు రోజులుగా అతడు నిద్ర కూడా పోలేదు. నిద్రలేమితో కలత చెందిన అతను.. తన రూంలో అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఈ ఘటనను చూసిన మృతుడి సోదరి.. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం పరీక్షల నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు పోలీసులు.
కొడుకు చనిపోయాడని కుటుంబం ఆత్మహత్య..
రాజస్థాన్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది. కొడుకు చనిపోయాడని.. ఇద్దరు భార్యభర్తలు తమ కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారాం, మీరా భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా పాలి జిల్లాలోని మేఘవాల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు.