Islamic Radicals Case Update : ఇస్లామిక్ రాడికల్స్ కేసు.. భోపాల్‌కు ఇంటెలిజెన్స్ టీమ్ - హైదరాబాద్‌లో ఇస్లామిక్ రాడికల్స్ కేసు
11:50 May 11
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో కొనసాగుతున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు
Islamic Radicals In Hyderabad : విశ్వనగరంగా వెలుగొందుతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అశాంతి నెలకొల్పాని ప్రయత్నించిన కొన్ని సంఘ విద్రోహ శక్తులను స్థానిక పోలీసులతో పాటు నిఘా సంస్థలు అణిచివేశాయి. పాపులర్ ఫ్రంట్ నుంచి విడిపోయిన కొంత మంది కార్యకర్తలు ఇస్లామిక్ రాడికల్స్‌గా ఏర్పడి హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. స్థానిక పోలీసుల సాయంతో ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఈ టీమ్ ఇవాళ భోపాల్‌కు చేరుకుంది.
భోపాల్ చేరుకున్న ఇంటెలిజెన్స్ టీమ్ ఇస్లామిక్ రాడికల్స్‌కు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ కేసులో నిందితులకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. జోహార్‌నగర్‌కు చెందిన సల్మాన్‌పై కేసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు నివాసం ఉండే ప్రాంతాల్లో నిఘా పెట్టారు. నిందితులు ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక మసీదులకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నిందితులతో సన్నిహితంగా మెలిగిన వారి గురించీ ఆరా తీస్తున్నారు. అనుమానితుల వివరాలు సైతం పోలీసులు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇస్లామిక్ రాడికల్స్ కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలిపారు. ఈ కేసులో అధికారులు హైదరాబాద్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు. అరెస్టైన వారి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా హోం శాఖ అప్రమత్తమైందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో ఇస్లామిక్ రాడికల్స్ పట్టుపడతామని అన్నారు.