తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Terror attacks: రాజధానిలో ఉగ్ర దాడులకు కుట్ర..! - దిల్లీలో ఉగ్రదాడులు

పండుగల వేళ దేశ రాజధాని దిల్లీలో ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించాయి.

terrorist attacks in the national capital
రాజధానిలో ఉగ్ర దాడులకు కుట్ర

By

Published : Sep 4, 2021, 8:00 PM IST

దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఐఈడీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్టు హెచ్చరించిన నిఘా అధికారులు.. ఉగ్రవాద ఘటనలను నివారించేందుకు భద్రతా ఏర్పాట్లు మరింతగా పెంచాలని సూచించారు.

జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన కారు పేలుళ్ల తరహాలోనే మరోసారి ఆ దేశ పౌరులనే లక్ష్యంగా చేసుకొని ముష్కర మూకలు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది నిఘా విభాగం. ఈ నెల 6న ఇజ్రాయెల్‌ పౌరుల సెలవులు ప్రారంభం కానున్నందున వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఇందుకోసం ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌ సిబ్బంది, వారి నివాసాలు, కోషెర్‌ రెస్టారెంట్‌, చాబాద్‌ హౌస్‌, యూదుల కమ్యూనిటీ సెంటర్‌ వంటి ప్రాంతాల్లో వచ్చే నెలాఖరు వరకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను పెంచాలన్నారు. ఇజ్రాయెల్‌ పౌరుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:బెదిరింపు సందేశాలు.. పోలీసుల హై అలర్ట్​!

ABOUT THE AUTHOR

...view details