UP Election Result: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖకు సమాచారం అందించాయి. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ అల్లర్లు జరిగే అవకాశమున్నట్లు పేర్కొంది.
నిఘా వర్గాలు పేర్కొన్న జాబితాలో కాన్పుర్, సహరన్‌పుర్, సంభల్, మేరఠ్, బిజ్నోర్, జౌన్‌పుర్, అజాంగఢ్ వంటి కీలక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఓడిపోయిన అభ్యర్థులు.. కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.