రైతు ఉద్యమం ప్రారంభమై ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా జూన్ 26(శనివారం)న దిల్లీలో రైతు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే.. రైతుల ఆందోళనల్లో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. మెట్రో స్టేషన్లను ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరకు మూసివేయనున్నారు.
సేవ్ అగ్రికల్చర్ అండ్ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు. ఈ నిరసనల్లో ఇతర రైతు సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.