SC On Overseas Mediclaim: దరఖాస్తుదారు ఆరోగ్య పరిస్థితిని ఒక్కసారి అంచనావేసి పాలసీని మంజూరు చేశాక.. మళ్లీ తాజా ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి, దాన్ని తిరస్కరించే హక్కు బీమా సంస్థకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
అమెరికాలో చేసిన వైద్యఖర్చులపై మన్మోహన్ నందా అనే వ్యక్తి క్లెయిమును బీమా సంస్థ తిరస్కరించింది. దీనిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. దీంతో ఆయన సుప్రీం తలుపు తట్టగా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది.