Insurance agent raped: హరియాణా గురుగ్రామ్‌లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బీమా పాలసీ తీసుకుంటామని చెప్పి ఓ హోటల్‌కు మహిళను పిలిపించుకున్న దుండగులు.. అక్కడే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులను వికాస్ జగ్గు, జితేంద్ర చౌదరిగా గుర్తించారు. ఇరువురిపై భోండ్సీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సోనీపత్‌కు చెందిన బాధితురాలు గురుగ్రామ్‌లో నివసిస్తోంది. 2019లో జగ్గుకు ఇన్సూరెన్స్ పాలసీ విక్రయించింది. జగ్గు తల్లి మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించేందుకు బాధితురాలు సహకరించింది. అయితే, గత 15 రోజుల నుంచి జగ్గు.. బాధితురాలికి తరచూ కాల్స్ చేశాడు. తన స్నేహితుడు రూ.30 లక్షల బీమా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని, పాలసీ ఇప్పించాలని కోరాడు. ఇందుకోసం మహిళను హోటల్‌కు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మహిళను జగ్గు, చౌదరి కలిసి రేప్ చేశారు.
మైనర్‌పై దారుణం
మతిస్థిమితం లేని బాలికపై ఓ కామాంధుడు తన దుష్ట వాంఛ తీర్చుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి న్యూ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇంటి సమీపంలో బాలిక ఆడుకుంటుండగా నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గర్లోని పొలాల వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం చేశాడు. కొందరు మహిళలు బాలిక అరుపులు, ఏడుపులు విని ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటికే నిందితుడు పారిపోయాడు. బాలిక కుటుంబ సభ్యులకు స్థానిక మహిళలు సమాచారం అందించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు.