తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rahul Gandhi: 'నేనూ అమరవీరుడి బిడ్డనే.. ఈ అవమానాన్ని సహించను!' - రాహుల్​గాంధీ తాజా వార్తలు

జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణం ఆధునీకరణపై(Jalian wala bhag restoration) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మారక ప్రాంగణం ఆధునీకరించటం.. అమరులను అవమానపరచడమేనని.. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తులు మాత్రమే అలాంటి వాటికి పాల్పడతారని దుయ్యబట్టారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).

Rahul Gandhi
రాహుల్ గాంధీ

By

Published : Sep 1, 2021, 6:45 AM IST

పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ఆధునీకరించడంపై (Jalian wala bhag restoration) కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది అమరులను అవమానపరచడమేనని.. బలిదానానికి అర్థం తెలియని వ్యక్తులు మాత్రమే అలాంటి వాటికి పాల్పడతారని దుయ్యబట్టారు. ఈ మధ్యే పునరుద్ధరించిన అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఈ విధంగా స్పందించారు.

రాహుల్ గాంధీ ట్వీట్

"జలియన్‌వాలాబాగ్‌ అమరవీరులను అవమానించడం అమరుల త్యాగాలకు అర్థం తెలియని వారు మాత్రమే చేయగలరు. నేను అమరవీరుడి బిడ్డనే. అమరవీరులకు జరిగే అవమానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదు. అంతేకాకుండా ఇలాంటి దారుణాలకు మేము వ్యతిరేకం."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

జలియన్‌వాలా బాగ్‌ ఉదంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా అక్కడి ప్రాంగణాన్ని ఈ మధ్యే ఆధునీకరించారు. స్మారకం వద్ద మ్యూజియం, నాలుగు గ్యాలరీలతో పాటు ఆనాటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఆ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయితే, దీనిపై విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి.

అలాంటివారే ఇలాంటి దారుణాలకు..

స్వాతంత్య్ర సమరానికి దూరంగా ఉన్న వారే ఇలాంటి అపచారాలకు పాల్పడుతారని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. అక్కడ డిస్కో లైట్ల వంటి ఏర్పాటు చేయడం వల్ల అదో వేడుక ప్రదేశంగా మారుతుందే తప్ప ఆనాటి మారణహోమం తీవ్రతను గుర్తుచేయదని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ పేర్కొన్నారు. అప్పటి విషాద ఘటన జరిగిన చోటును అందంగా అలంకరించిన ప్రదేశంగా మార్చడం పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు.

టాయిలెట్​ అయినా కట్టించారా..?

మరోవైపు రాహుల్​గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు భాజపానేతలు. కాంగ్రెస్ పార్టీ.. జలియన్‌వాలా బాగ్‌ స్మారక ప్రాంగణంలో కనీసం టాయిలెట్ అయినా కట్టించలేదని ఆరోపించారు. స్మారకం కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని భాజపా జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ ప్రశ్నించారు.

1919 ఏప్రిల్‌ 13న జరిగిన జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం(Jallianwala bagh massacre) స్వాతంత్య్ర సమరంలో (Indian Independence Movement) కీలక ఘట్టంగా పేర్కొంటారు. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అందులో భాగంగా జలియన్‌వాలా బాగ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంపై బ్రిటిష్‌ అధికారి జనరల్ డయ్యర్ ఆదేశాలతో వారిపై సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఆ మారణహోమంలో దాదాపు వెయ్యి మందికిపైగా అమరులు కాగా వందల మంది గాయాలపాలయ్యారు.

ఇదీ చదవండి:నాపై యాసిడ్ దాడి​ చేశారు.. దేవుడే కాపాడాడు: కేంద్ర మంత్రి

ABOUT THE AUTHOR

...view details