తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి - enforcement directory

loan fraud
లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి

By

Published : Jan 4, 2021, 6:11 PM IST

Updated : Jan 4, 2021, 8:53 PM IST

18:07 January 04

లోన్​ యాప్​ మోసాలపై ఈడీ దృష్టి

తెలంగాణ, తమిళనాడులో పలువురు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన లోన్​ యాప్​ మోసాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దృష్టిసారించింది. ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్న రూ.1,100 కోట్ల ఆన్​లైన్​ బెట్టింగ్​ కుంభకోణం కేసులో భాగంగా లోన్​ యాప్​ మోసాల సంగతి కూడా తేల్చాలని నిర్ణయించింది. 

ప్రజల్ని మోసగించడం, భారీగా డబ్బులు దండుకోవడం, ఆ మొత్తాన్ని అక్రమ మార్గాల్లో చైనా సహా ఇతర దేశాలకు తరలించడంలో ఆన్​లైన్​ బెట్టింగ్​ స్కామ్​, లోన్​ యాప్​లకు సారూప్యత ఉందని ఈడీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నమోదైన ఫిర్యాదులపై ఈడీ దర్యాప్తు చేపట్టనుందని స్పష్టం చేశాయి.  

ఆన్​లైన్​ వేధింపు..  

బాకీ చెల్లించమంటూ పలు లోన్​ యాప్​లు చేస్తున్న వేధింపులు భరించలేక తెలంగాణలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేయగా, 29 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు చైనీయులు కూడా ఉండటం గమనార్హం.  

తమిళనాడు పోలీసులు కూడా స్థానికుల ఫిర్యాదుల మేరకు పలువురని అరెస్టు చేశారు. చైనాకు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.  

బెట్టింగ్.. చైనా సెట్టింగ్..      

రూ.1100 కోట్ల ఆన్​లైన్ బెట్టింగ్​ స్కామ్​పై ఈడీ చేపడుతున్న దర్యాప్తులో చైనాకు చెందిన వారి హస్తం ఉందని తెలిసింది. డొకీపే టెక్నాలజీ, లింక్​యున్​ టెక్నాలజీ సంస్థలపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్ ఆధారంగా ఈడీ గతేడాది దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఓ చైనాకు చెందిన వ్యక్తిని సహా మరో ఇద్దరిని అరెస్టు చేసింది.     ​  

ఇదీ చూడండి :పట్టు వీడని రైతులు- మెట్టు దిగని కేంద్రం            

Last Updated : Jan 4, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details