CCTV in Spa: మసాజ్ సెంటర్లో సీసీటీవీ ఏర్పాటును తప్పుపట్టింది మద్రాస్ హైకోర్టు. అది వచ్చిన వారి వ్యక్తిగత గోప్యత, హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంది. సీసీటీవీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఆధ్వర్యంలోని మదురై బెంచ్ వ్యాఖ్యానించింది.
ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగిస్తూ సీసీటీవీ ఏర్పాటు చేయాలంటే అందుకు బలమైన కారణం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కేవలం అనుమానం ఉందన్న కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని తెలిపింది.