Instagram Bug Winner : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచినప్పటి నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఫేస్బుక్, వాట్సాప్, షేర్‌చాట్, ఇన్స్టాగ్రామ్ తదితర యాప్‌ల్లో గడుపుతున్నారు. అయితే హ్యాకర్లు.. ఇదే అదనుగా తీసుకుని సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం హ్యాకర్లు.. ఎంతో మంది ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు కావాలని ఫ్రెండ్స్‌కు మెసేజ్‌లు పెట్టారు. అలా పంపి మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థి.. కోట్లాది మంది సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ అవ్వకుండా కాపాడాడు. అందుకుగాను భారీ మొత్తంలో రివార్డు కూడా అందుకున్నాడు. అవునండీ నిజమే.. అసలేం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన నీరజ్ శర్మ అనే విద్యార్థి.. తరచూ ఇన్స్టాగ్రామ్ వాడుతుంటాడు. తన ఫ్రెండ్స్ చేస్తున్న రీల్స్‌ను చూసి ఆనందించేవాడు. అయితే గతేడాది డిసెంబర్లో రీల్స్ సెగ్మెంట్లో బగ్ ఉందని గ్రహించాడు. అందుకు నెల రోజుల పాటు కష్టపడ్డ అతడు.. జనవరి 31న బగ్‌ను గుర్తించాడు.