తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో దశలో టీకా తీసుకున్న ప్రముఖులు వీరే.. - కరోనా వ్యాక్సిన్​ పంపిణీ

కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్​ కేంద్రాల్లో టీకా పంపిణీ చేపట్టారు అధికారులు. తొలిరోజు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. ఆయా ప్రముఖులు వ్యాక్సిన్​ తీసుకున్నారు.

Prime Minister Narendra Modi on Monday took his first dose of the COVID-19 vaccine
తొలిరోజు కరోనా టీకా తీసుకున్న ప్రముఖులు వీరే..

By

Published : Mar 1, 2021, 11:21 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా.. రెండో విడత కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 60ఏళ్లు నిండిన వారు సహా.. 45ఏళ్ల నుంచి 59ఏళ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు టీకా అందించారు అధికారులు. ఇందుకోసం దేశ‌వ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20వేల ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ చేపట్టారు. ఆర్థిక స్థోమత ఉండి, వ్యాక్సిన్​ తీసుకోవాలనుకునేవారికి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సౌకర్యాన్ని కల్పించారు. తొలిరోజు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మోదీ స్వదేశీ టీకా కొవాగ్జిన్‌ వేయించుకున్నారు.

దిల్లీలో 80 శాతం మంది పోలీసులకు మొదటి విడత కరోనా టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథికి వ్యాక్సిన్‌ అందజేశారు. దిల్లీ, మహారాష్ట్ర, పుణేల్లో కరోనా టీకా కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా టీకా తీసుకున్నారు. తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన.. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్​ వేయించుకున్నారు. మరో 28 రోజుల తర్వాత మళ్లీ రెండో డోసు తీసుకుంటానని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. కరోనా టీకా తీసుకునేందుకు అర్హులందరూ ముందుకు రావాలని.. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వెంకయ్య.

అయితే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం రోజు కరోనా టీకా తీసుకోనున్నారు. రెండు దేశీయ టీకాల్లో ఏ వ్యాక్సిన్​ తీసుకోవాలన్నది న్యాయమూర్తులే నిర్ణయించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

టీకా తీసుకున్న పలువురు ప్రముఖులు..

ప్రధాని నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​
శరద్​ పవార్​
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​
బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​
విదేశాంగ మంత్రి జైశంకర్​
ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, సుధా మూర్తి

ఇదీ చదవండి:'భారత్​ బయోటెక్​, సీరం'లపై చైనా హ్యాకర్ల గురి!

ABOUT THE AUTHOR

...view details