కరోనా సెకండ్ వేవ్‌పై ధైర్యంగా పోరాడుతున్న భారత్‌కు విదేశాల నుంచి సాయం అందుతోంది. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలు బుధవారం ఆపన్నహస్తం అందించాయి. ఆస్ట్రేలియా నుంచి 1056 వెంటిలేటర్లు, 43 ఆక్సిజన్ మెషిన్లు ప్రత్యేక విమానంలో భారత్‌కు వచ్చాయి. అటు ఇజ్రాయెల్.. అత్యవసర వైద్యసామగ్రిని భారత్‌కు పంపించి తన ఉదారతను చాటుకుంది.
విమానం నుంచి వైద్యసామగ్రి ఆపరేషన్ సముద్రసేతు-2
ఇక బహ్రెయిన్ కూడా ఆపరేషన్ సముద్రసేతు-2లో భాగంగా.. 20 మెట్రిక్ టన్నులు కలిగిన రెండు ద్రవ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించింది. ఇవి ఐఎన్ఎస్ తల్వార్ నౌకలో.. కర్ణాటకలోని న్యూ మంగళూరు నౌకాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ మద్దతుకు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగిచీ కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎన్ఎస్ తల్వార్ వద్ద అధికారులు ఇజ్రాయెల్ విమానం నుంచి వైద్యపరికరాలు ఇజ్రాయెల్ నుంచి వైద్యపరికరాలు పంపిణీ వీటితో పాటు సింగపూర్ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్, కువైట్ నుంచి ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఆక్సిజన్ మెషిన్లు, అత్యవసర వైద్యసామాగ్రి, వెంటిలేటర్లతో భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈయూ రూ. 19 కోట్లు సాయం
కరోనాతో పోరాడుతున్న భారత్‌కు అత్యవసర విరాళం కింద రూ. 19 కోట్లు ప్రకటించింది ఈయూ. వైద్య పరికరాలనూ అందిస్తున్నట్లు యూరోపియన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి పనిచేస్తామని తెలిపింది. వైరస్‌తో కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి :చైనా రాకెట్‌తో ప్రపంచానికి ముప్పు!