మనుషులు రెండు రకాలు. గుంపులో కలిసిపోయి, అందరితోపాటే నడిచేవారు ఒకరకమైతే, మిగతావారి కంటే భిన్నమైనదేదైనా చేసి, ప్రత్యేకంగా నిలిచేవారు రెండోరకం. సామ్రాట్, రజనీష్ ఆ రెండోకోవకే చెందుతారు. ఈ కథ మాత్రం వీళ్లిద్దరిది కాదు. వాళ్లు తయారుచేసిన స్మార్ట్ బూట్లు, కళ్లద్దాలది. చూపులేని వారి కోసం ఈ పిల్లలు తయారుచేసిన పరికరాలివి. ఆ కథేంటో చూద్దామా?
ఓరోజు సామ్రాట్, రజనీష్ బడికి వెళ్తుండగా... ఓ పెద్దాయన వాళ్లముందే రోడ్డుపై పడిపోయాడు. ఎందుకు పడిపోయారని అడిగితే, తాను చూడలేనని సమాధానం చెప్పాడు. అది విని, బాధపడ్డ స్నేహితులిద్దరూ అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కళ్లజోడు, బూట్లు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.
నేను, నా స్నేహితుడు పాఠశాలకు వస్తుండగా...దారిలో ఓ చూపులేని వ్యక్తి కిందపడిపోయాడు. ఆయన్ను పైకి లేపి, అలా ఎందుకు పడిపోయారని అడిగాం. నేను చూడలేనని చెప్పాడాయన. మాకు బాధగా అనిపించింది. అలాంటివాళ్లకు మేలు చేసే పరికరం తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది.
-సామ్రాట్ బోస్, విద్యార్థి
ఓ ఆలోచనతో విద్యార్థులు నావద్దకు వచ్చారు. అంధులు నడిచేందుకు సహకరించే ప్రత్యేక కళ్లజోడు తయారుచేస్తామని చెప్పారు.
-బీకే సింగ్, ఉపాధ్యాయుడు
ఈ బూట్లు, కళ్లజోళ్లలో ఉండే సెన్సర్లు....వాటిని ధరించిన వ్యక్తి ఏదైనా అవరోధానికి 3 మీటర్ల దూరంలో ఉండగానే అప్రమత్తం చేస్తాయి. వీటి సాయంతో, చూపులేనివారు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలరు.
బూట్లలో అల్ట్రాసోనిక్ సెన్సర్ అమర్చాం. ఏ అవరోధాన్నైనా ఇది గుర్తిస్తుంది. వెనక ఉండే అవరోధాలను కూడా గుర్తించేందుకు షూ వెనక భాగంలోనూ ఓ సెన్సర్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నాం.
-రజనీష్ రంజన్, విద్యార్థి