తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి నిర్లక్ష్యం.. నేలపైనే బాధితుడు.. కుక్క వచ్చి రక్తం నాకినా..

యూపీలో అమానవీయ ఘటన జరిగింది. గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తిని పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఆస్పత్రిలో ఓ రోగి నేలపైనే ఉండటం, ఈ క్రమంలో శునకం బాధితుడి రక్తాన్ని నాకడం వీడియోకు చిక్కింది.

man blood licked by dog in uttarpradesh
man blood licked by dog in uttarpradesh

By

Published : Nov 3, 2022, 3:48 PM IST

ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. తీవ్రగాయాలతో ఖుషీనగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తిని.. ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. రక్తస్రావం అవుతున్న బాధితుడిని ఆస్పత్రి నేలపైనే పడుకోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలోకి ఓ శునకం వచ్చి రక్తాన్ని నాకుతుండటం వీడియోలో కనిపిస్తోంది.

వైరలయిన ఆస్పత్రి వీడియో

బాధితుడు ఓ ప్రమాదంలో గాయపడ్డట్లు తెలుస్తోంది. అతడిని స్థానికులు ఖుషీ నగర్​లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆ వ్యక్తిని అత్యవసర వార్డుకు తీసుకెళ్లగా.. ఆ సమయంలో అక్కడ ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో అతన్ని నేలపైనే పడుకోబెట్టాల్సి వచ్చింది. ఎంత సేపు చూసినప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అక్కడికి రాలేదు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇంతలో నేలపైన కారుతున్న రక్తాన్ని నాకేందుకు ఓ కుక్క పిల్ల అటువైపు వచ్చింది. కదలలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుడు.. అలాగే ఉండిపోయాడు. బాధితులకు మెరుగైన వైద్యం చేయడం అటుంచితే.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details