కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు 150కి పైగా వీధి శునకాలను సజీవంగా పూడ్చిపెట్టారు. భద్రావతి తాలుకా పరిధిలో జరిగింది ఈ ఘటన.
ఇంతకీ ఏం జరిగింది..?
హూసూర్ పంచాయత్, హన్సెకట్టే జంక్షన్, రంగనాథపూర్ గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా.. శునకాలను పట్టే బృందానికి సమాచారమిచ్చారు. ఆ బృందం ఆయా గ్రామాల్లోని 150కిపైగా కుక్కలను పట్టుకుని.. తమ్మడి హల్లి అటవీ ప్రాంతంలో బతికుండగానే పూడ్చి పెట్టారు. శునకాలను పూడ్చే సమయంలో వాటి అరుపులు విని.. స్థానికులు అక్కడకు చేరుకోగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే కుక్కలను పూడ్చిన బృందం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.