Rahul Gandhi news: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అన్నారు. పెరిగే ధరల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలను చేపట్టాలని కోరారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించిందని చెప్పారు.
"ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైగా పెరిగింది. ఆహార వస్తువుల ధరలు 22 శాతం మేర పెరుగుతాయని అంచనాలున్నాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థ కొవిడ్ కారణంగా దెబ్బతింది. కనీసం ఇప్పుడు అయినా కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ప్రజలను పన్ను బారి నుంచి రక్షించాలి."