తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చొరబాటు కుట్ర భగ్నం- ముగ్గురు ముష్కరులు హతం - Infiltration bid foiled latest update

జమ్ముకశ్మీర్​ మాచిల్​ ప్రాంతంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు ఓ బీఎస్​ఎఫ్​ సైనికుడు వీర మరణం పొందారు.

Infiltration bid foiled in Machil, one militant, BSF trooper killed
చొరబాటు విఫలం.. ఇద్దరు మృతి

By

Published : Nov 8, 2020, 3:37 PM IST

జమ్ముకశ్మీర్​ మాచిల్​ సెక్టర్​లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు, ఓ బీఎస్​ఎఫ్​ జవాను వీర మరణం పొందారు.

శనివారం అర్ధరాత్రి సమయంలో నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించింది సైన్యం. అనంతరం రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు అప్రమత్తమై ప్రతిఘంటించారు. ఈ పరిణామాలు ఎదురుకాల్పులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారి వద్ద నుంచి ఒక ఏకే రైఫిల్​తో పాటు రెండు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే మరణించిన ఉగ్రవాదుల వివరాలు, చొరబాటు సంబంధిచిన అంశాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: ఎనిమిదో విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం!

ABOUT THE AUTHOR

...view details