Indore two girls fire: కుటుంబ కలహాలకు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు బలయ్యారు. తన ప్రేమను అంగీకరించట్లేదన్న కోపంతో తన అన్న ఇంటికి నిప్పు పెట్టింది బర్ఖా మేడా అనే మహిళ. ఈ ఘటనలో నిందితురాలి అన్న కుమార్తెలు ఇద్దరు కాలిపోయి మరణించారు. ఈ దారుణం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో సోమవారం రాత్రి జరిగింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతులు నందు 4, ముస్కాన్ 6 ఏళ్ల వయసు గల బాలికలు.
అన్న ఇంటికి చెల్లి నిప్పు.. ఇద్దరు మేనకోడళ్లు సజీవదహనం
Indore two girls fire: మధ్యప్రదేశ్లోని ఇందోర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్న కోపంతో.. తన అన్న ఇంటికి నిప్పంటించింది ఓ మహిళ. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు.
"కుటుంబ కలహాల కారణంతోనే ఇందోర్లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్న తన అన్న ఇంటికి నిందితురాలు బర్ఖా మేడా నిప్పంటించింది. ఈ ఘటనలో నిద్రలో ఉన్న ఆమె అన్న కుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి ఇద్దరు బాలికలు పూర్తిగా కాలిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. నిందితురాలికి ఆమె కుటుంబంతో గొడవ జరిగింది. ఆ సమయంలో నిందితురాలిని ఆమె తండ్రి కొట్టాడు. అప్పుడు ఆవేశంతో తన అన్న ఇంటికి నిప్పంటించింది. నిందితురాలి అన్న, తండ్రి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది" అని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'మరణం'పై కవితలు.. ఉరేసుకుని ఆత్మహత్య.. 'టాప్ ర్యాంక్' బాలికకు ఏమైంది?