8 ఏళ్ల వయసులోనే యోగాపై పుస్తకం రాసిన చిన్నారులు యోగా విశిష్టతను మరింత మందికి చేరువ చేసేలా... మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని ఓ ఇద్దరు చిన్నారులు వినూత్నంగా ఆలోచించారు. 'సూర్య నమస్కారాలు' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అంతేకాదు.. యోగాసనాలకు సంబంధించిన పెయింటింగ్స్నూ వారు రూపొందించారు. ఈ పుస్తకాన్ని, పెయింటింగ్స్‌ను ఇందోర్ విమానాశ్రయంలో ఆదివారం విడుదల చేశారు.
దేవయానీ భరద్వాజ్(8), శివరంజని భరద్వాజ్(8) అనే మూడో తరగతి చదివే ఇద్దరు కవలలు ఈ పుస్తకాన్ని రాశారు. ప్రకృతితో మమేకమై యోగసనాలు వేస్తున్న మనుషుల చిత్రాలను వారు వేశారు. వీటిని మాజీ మేయర్ మాలినీ గౌర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత జానక్ పాల్తా సమక్షంలో ఇందోర్ విమానాశ్రయ అధికారులు విడుదల చేశారు.
దేవయానీ భరద్వాజ్, శివరంజని భరద్వాజ్ ఇక్కడే ఉంచుతాం..
యోగాసనాల చిత్రాలను ఈ చిన్నారులు అద్భుతంగా చిత్రీకరించారని విమానాశ్రయ డైరెక్టర్ ఆర్యమా సన్యాల్ ప్రశంసించారు. వారి పెయింటింగ్స్‌ను తాము విమానాశ్రయంలో ప్రదర్శిస్తామని చెప్పారు. తద్వారా ప్రయాణికులు యోగా దినోత్సవ విశిష్టతను తెలుసుకుంటారని చెప్పారు. మరో 15 రోజులు వీటిని ఇక్కడే అమ్మకానికి ఉంచుతామని పేర్కొన్నారు.
తాము గీసిన పెయింటింగ్స్ వద్ద చిన్నారులు మరోవైపు.. 7వ అంతర్జాతీయ దినోత్సవ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీసోమవారం ప్రసంగించారు. కరోనా విపత్తు వేళ యోగా.. ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు. వైరస్‌తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా వ్యాధినిరోధక శక్తితో పాటు అంతర చైతన్యమూ పెరుగుతుందని అన్నారు.
ఇదీ చూడండి:Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా యోగా సెంటర్లు
ఇదీ చూడండి:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెబినార్