స్మార్ట్ సిటీస్ కాంపిటీషన్-2020 అవార్డును రెండు నగరాలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ప్రకటించిన జాబితాలో.. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్, గుజరాత్‌లోని సూరత్ పట్టణాలు అర్బన్ కేటగిరీలో తొలిస్థానంలో నిలిచి.. అవార్డును గెలుచుకున్నాయి. రాష్ట్రాల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గ శంకర్ మిశ్రాలు ప్రకటించారు.
స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియా స్మార్ట్ సిటీస్ కాంపిటీషన్-2020ని ఆన్లైన్ ద్వారా నిర్వహించింది కేంద్రం. ఈ మూడు మిషన్లను 2015, జూన్ 25 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.